ఎగువచావాలి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోళ్ల రాంబాబు (60) అనే వ్యవసాయ కూలీ మృతి చెందాడు. రహదారి దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.