జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్ సిబ్బంది 25 ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఉపయోగించి 110 మందికి
పరీక్షలు నిర్వహించగా, నలుగురికి మాదకద్రవ్యాల వాడకం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ తనిఖీల్లో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ చర్యలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాడకాన్ని అరికట్టేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.