చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. కార్వేటినగరంలో 19.2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సోమలలో 14.0, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది.