యాదమర్రి మండలంలో రేషన్ బియ్యం స్వాధీనం

1318చూసినవారు
యాదమర్రి మండలంలో రేషన్ బియ్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా, యాదమరి మండలం సంతగేటు గ్రామంలో శనివారం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్ఐ ఈశ్వర్, డీటీ జయంతి, ఆర్ఎ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న అబ్దుల్ సలాంను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్