ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం: 54 ఫిర్యాదులు స్వీకరణ

0చూసినవారు
ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం: 54 ఫిర్యాదులు స్వీకరణ
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. మొత్తం 54 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో నగదు లావాదేవీలకు 6, ఆస్తి తగాదాలకు 7, భూతగాదాలకు 23 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్