వీకోటలో విలేకరి జగన్ మోహన్ రెడ్డి హత్య జరిగిన ఘటనపై ఎస్పీ తుషార్ డూడీమంగళవారం స్పందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని, హత్య జరిగిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. నిందితులను వేగంగా గుర్తించి అరెస్ట్ చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.