వీకోటలో జర్నలిస్ట్ హత్య చాలా బాధాకరం: కలెక్టర్

3చూసినవారు
పలమనేరు నియోజకవర్గం వి. కోటలో జరిగిన జర్నలిస్టు హత్య పట్ల జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే విలేకరిని హత్య చేయడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడానని, బాధితుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :