తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. వేసవిలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని వీధులకు 51 కొత్త పేర్లు నిర్ణయించారు. ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 4.54 కోట్లు, గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ. 6 కోట్లతో పైప్ లైన్లు, రూ. 44.2 కోట్లతో పట్టువస్త్రాల కొనుగోలు, వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణకు రూ. 3.6 కోట్లు, అమరావతి శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ. 36.9 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మంలో టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రాతి రథమండపంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చైర్మన్ తెలిపారు.