Dec 04, 2025, 11:12 IST/
ఢిల్లీలో హై అలర్ట్.. 5000 మంది పోలీసుల మోహరింపు
Dec 04, 2025, 11:12 IST
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్‌లో ఉంది. ఆయన మరికాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు, పుతిన్ వ్యక్తిగత సిబ్బందితో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది. దాదాపు 5000 మందికిపైగా పోలీసు సిబ్బందిని నగరంలో మోహరించారు.