
ఎస్ఆర్ పురం: ఫోర్జరీ సంతకం పై పోలీసులకు ఫిర్యాదు
గురువారం, ఎస్ఆర్ పురం మండలంలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తహశీల్దార్ లోకనాథం పిల్లై సంతకాన్ని కొందరు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. గతంలో పొదలపల్లి పరిధిలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తహశీల్దార్ లోకనాథం పిల్లై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు.







































