మంగళవారం, ఎస్ఆర్ పురం మండలం, ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ మెట్ట హరిజనవాడ గ్రామంలో రైతు నవీన్ కు చెందిన దాదాపు 5 ఎకరాల చెరుకు పంట, రెండు గానుగ షెడ్లు, మూడు లక్షల విలువైన బెల్లం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి బాధితులను పరామర్శించి, రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.