జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, పద్మాపురం సమీపంలోని రెవెన్యూ భూమిలో ఉన్న చెరువు కాలువ ఆక్రమణకు గురైనట్లు స్థానికులు శుక్రవారం సమాచారం అందించారు. ఆరిమాకులకోన నుంచి వచ్చే కాలువను కొందరు వ్యక్తులు పూడ్చివేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.