జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, పచ్చికాపల్లంలోని అరుణగిరి క్షేత్ర జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం, జ్వాలా తోరణం, గిరి ప్రదక్షణ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.