జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.