మంగళవారం, జీడి నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు గ్రామంలోని మోడల్ ఫౌండేషన్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో మూడు సచివాలయాల అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలకు కిషోరి వికాసంపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్య, వైద్యం, సామాజిక సమస్యలు, చట్టాలు, పౌష్టికాహారం, పరిశుభ్రత, బాల్యవివాహాల అనర్థాలు, ఫోక్సో చట్టం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.