కార్వేటినగరంలో సోమవారం ప్రియురాలిపై అనుమానంతో చంద్రశేఖర్ (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్, ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.