ఎస్ఆర్ పురం మండలం, ఏయంపురం ఆదిఆంధ్రవాడ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో గంజాయి అమ్మిన, తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాటు సారా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.