కార్వేటి నగరంలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

14చూసినవారు
కార్వేటి నగరంలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై
జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలంలోని పుత్తూరు-చిత్తూరు ప్రధాన రహదారిపై వాహనాలను నిలపరాదని ట్రైనీ ఎస్ఐ రమేష్ నాయక్ తెలిపారు. బుధవారం ఆయన తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరం బస్టాండ్ కూడలిలో ప్రధాన రహదారిపై వాహనదారులు ఇష్టానుసారం వాహనాలను పార్కింగ్ చేయడాన్ని గుర్తించి, వారికి సూచనలు చేశారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్