ఎస్ఆర్ పురం మండలం వడ్డిపాలెం గ్రామంలో గీత, ఆమె ఇద్దరు కుమార్తెలపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. బాధితురాలు గీత తన కథనం మేరకు, సుమారు 15 సంవత్సరాలుగా పరంబోకి స్థలంలో పండ్ల చెట్లు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేక ప్రత్యర్థులు తన భర్త లేని సమయంలో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనపై గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.