శ్రీపురం మండల పరిధిలోని వెలింగరం కొండపై ఉన్న 200 ఏళ్ల పురాతన స్వయంభు సోమేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయానికి పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.