వెదురుకుప్పం మండలం, రెంటాలచేనులో శుక్రవారం శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి (చౌడమ్మ) విగ్రహ ప్రతిష్ట మరియు కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.