Jan 15, 2026, 17:01 IST/
రెండో పెళ్లికి నిరాకరించిందని భార్యను గొంతు నులిమి చంపిన వ్యక్తి
Jan 15, 2026, 17:01 IST
తమిళనాడులోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండో పెళ్లిని వ్యతిరేకించినందుకు భర్త గోపి తన భార్య చందనబాయిని గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు నిందితుడు గోపిని అరెస్టు చేశారు. వేర్వేరు కులాలకు చెందిన గోపి, చందనబాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. గోపి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించగా, చందనబాయి వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహించిన గోపి ఆమెను ఇంట్లోనే హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.