గొల్లపల్లిలో లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా గరుడ సేవ

0చూసినవారు
తిరుపతి సమీపంలోని గూడూరు మండలం గొల్లపల్లి వద్ద ఉన్న కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, రాత్రి స్వామివారిని పల్లకిలో గరుడసేవ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్