గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసెంబ్లీలో కోట మండలం గోవిందపల్లి–పట్టపుపాలెం మార్గంలో బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రస్తావించారు. ఆ మార్గంలో బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో మామిడి, చల్లా కాలువలు, స్వర్ణముఖి నది వరదల కారణంగా ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ. 6కోట్లతో కాజ్వే తరహా బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.