గూడూరు: హక్కుల కోసం జరిగిన పోరాటమే ‘భీమా కోరేగావ్’

3చూసినవారు
గూడూరు: హక్కుల కోసం జరిగిన పోరాటమే ‘భీమా కోరేగావ్’
బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, హక్కులు, ఆత్మగౌరవం కోసం జరిగిన చారిత్రక పోరాటమే ‘భీమా కోరేగావ్’ అని అన్నారు. 1818 జనవరి 1న జరిగిన ఈ యుద్ధాన్ని స్మరించుకుంటూ గురువారం కోట మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల సాధనలో భీమా కోరేగావ్ పోరాటం స్ఫూర్తిదాయకమని, డాక్టర్ అంబేడ్కర్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్