గూడూరు: రూ. 23లక్షలతో నిర్మించిన రైతుసేవా కేంద్రం ప్రారంభం

3చూసినవారు
గూడూరు: రూ. 23లక్షలతో నిర్మించిన రైతుసేవా కేంద్రం ప్రారంభం
చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డివాగు గ్రామంలో శుక్రవారం రూ. 23 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, రైతులకు అవసరమైన సేవలు ఒకేచోట అందించేలా రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.