గూడూరు: కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి

3చూసినవారు
గూడూరు: కోడిపందెం స్థావరంపై పోలీసుల దాడి
మనుబోలు మండలం వడ్లపూడి అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి కోడిపందెం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ. 2,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శివ రాకేశ్‌తో పాటు పోలీసు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. కోడిపందేలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్