గూడూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రికి వినతిపత్రం అందజేశారు. తిరుపతికి వచ్చిన రెవెన్యూ మంత్రి వద్ద గూడూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు గూడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. పరిపాలనసేవలు, ప్రభుత్వ కార్యాలయాలకు దూరప్రయాణం, అత్యవసర పనుల్లో ఆలస్యం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి, గూడూరు జిల్లా డిమాండ్‌ను సిఎంకి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.