చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేనేతలు నిరసన నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వేలాది చేనేతలు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ముడిసరుకు, పనుల కేటాయింపు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.