Jan 28, 2026, 17:01 IST/
'పది'లో ఫస్ట్ వస్తే 10 గ్రాముల బంగారం:పారిశ్రామికవేత్త సుమన్ కుమార్
Jan 28, 2026, 17:01 IST
కృష్ణా జిల్లా ఉంగుటూరు ZP ఉన్నత పాఠశాలలో పారిశ్రామికవేత్త గుత్తా సుమన్ కుమార్ టెన్త్ విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 10 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతిలో వార్షిక పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి, వారు చదివిన తరగతికి సమానమైన గ్రాముల బంగారం అందిస్తానని తెలిపారు. సుమన్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు లక్ష రూపాయల విలువైన క్రీడా సామగ్రిని కూడా ఆయన అందించారు.