Jan 24, 2026, 13:01 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
Jan 24, 2026, 13:01 IST
జాతీయ బాలికల దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల, భవానీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ బాలికలు సమాజంలో అందరితో సమానంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలల రక్షణ అధికారి హరీశ్ కూడా పాల్గొన్నారు.