
కుప్పంలో రేపు డిగ్రీ విద్యార్థులకు జాబ్ మేళా
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చిదంబరం తెలిపారు. ఈ మేళాలో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించినవారు పాల్గొనవచ్చని, కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.







































