Jan 29, 2026, 15:01 IST/వేములవాడ
వేములవాడ
రైస్ మిల్ వ్యర్థాలు తిని 40 గొర్ల మృతి, 60 అస్వస్థ
Jan 29, 2026, 15:01 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్ వద్ద పడి ఉన్న బియ్యం వ్యర్థాలను తిన్న సుమారు 40 గొర్రెలు మృతి చెందాయి. మరో 60 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరగగా, గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధితులైన గొర్రెల కాపరులు ప్రభుత్వం జోక్యం చేసుకుని, మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.