కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, సింగసముద్రంలో మంగళవారం సంభవించిన గాలివాన బీభత్సానికి అరటి తోటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రైతు భాస్కర్ కు చెందిన అరటి తోటలో పక్వానికి వచ్చిన అరటి గెలలతో కూడిన చెట్లు ఈదురు గాలుల ధాటికి విరిగిపోవడంతో ఆయనకు అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇదే తరహాలో మామిడి రైతులకు కూడా నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.