రామకుప్పం (మం) బల్ధారు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు, అధ్యాపకులకు విద్యార్థుల భవిష్యత్తు విద్యా లక్ష్యాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశాలు తల్లిదండ్రులు, అధ్యాపకుల మధ్య అవగాహనను పెంచి, విద్యార్థుల అభ్యాసంలో మెరుగుదలకు దోహదపడతాయని ఆయన అన్నారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా అందించి, వారి విద్యా శైలి, బలాలు, మెరుగుపరచాల్సిన అంశాలను తెలియజేసేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.