చిత్తూరు: విషాదం.. మామ, మేనల్లుడు మృతి

2చూసినవారు
చిత్తూరు: విషాదం.. మామ, మేనల్లుడు మృతి
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కేంచనబల్లలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎద్దులను కడిగేందుకు కుంట వద్దకు వెళ్లిన గోవిందరాజులు (30), సతీష్ (18) లు నీటిలో మునిగి మృతి చెందారు. మేనల్లుడు సతీష్ ఎద్దులను కడిగేందుకు కుంటలో దిగగా, ఎద్దులు తాడును బలంగా లాగడంతో నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన మామ గోవిందరాజులు కూడా నీటిలో మునిగిపోయారు. గ్రామస్థులు వారిని బయటకు తీయగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్