చిత్తూరు జిల్లా, కుప్పంలో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. 150 ఎకరాల భూసేకరణకు కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్లపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ కేసును కొట్టివేసింది. అనంతరం రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి, ప్రజాప్రయోజనం స్పష్టంగా నిరూపించలేదని వాదించారు. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు పేర్కొంటూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.