కుప్పం నియోజకవర్గంలో మట్టి నుంచి కృత్రిమంగా ఇసుక తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో అనేక చోట్ల కృత్రిమ ఇసుక తయారీ యూనిట్లు ఉన్నాయని, వాటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. పలుచోట్ల యూనిట్లను ధ్వంసం చేసి కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.