రామకుప్పం మండలంలోని ననియాల పరిసర ప్రాంతాల్లో గత 10 రోజులుగా రాత్రిపూట వ్యవసాయ పొలాల్లోకి వస్తున్న ఒంటరి ఏనుగు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ ఏనుగు దాడిలో వరి, టమాటా పంటలతో పాటు వ్యవసాయ పరికరాలు ధ్వంసమయ్యాయి. రైతులు ఈ ఒంటరి ఏనుగును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.