గుడిపల్లి మండలంలోని కోటపల్లి సమీపంలో నాటు బాంబు పేలి కుక్క మృతి చెందింది. అడవి జంతువుల కోసం పెట్టిన బాంబును కుక్క తినేందుకు ప్రయత్నించగా అది పేలింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అడవి జంతువుల కోసం పెడుతున్న నాటు బాంబుల వల్ల ఇటీవల ఆవులు, కుక్కలు మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.