కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో నెల రోజులుగా ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి జంట ఏనుగులు రామాపురం తండా పరిసరాల్లోని పంట పొలాల్లో కనిపించడంతో రైతులు వాటిని తరలించడానికి ప్రయత్నించారు. ప్రతిరోజూ ఏనుగులు తమ పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.