కుప్పం పట్టణంలోని అగ్ని మాపక వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ వరకు నిర్వహిస్తామని అగ్నిమాపక అధికారి ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ వారం రోజులు పాటు జరిగే కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను గురించి వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అగ్ని ప్రమాద వారోత్సవాలు అవగాహన నిర్వహించడం వలన ప్రజలు అగ్ని ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు అన్నారు.