మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీపీఆర్ఓ పూడి శ్రీహరిని గుంటూరు కొత్తపేట పోలీసులు గురువారం కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కుప్పం పోలీసులు శ్రీహరికి నోటీసులు ఇచ్చిన తర్వాత, ఆయన లాయర్ల సమక్షంలో గుంటూరు పోలీసులు స్టేషన్ బయట నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీహరిని కుప్పం నుంచి గుంటూరుకి తరలించారు.