కుప్పం: గోడకూలి నలుగురికి తీవ్ర గాయాలు

449చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాలువను శుభ్రం చేస్తున్న 15 మంది మున్సిపల్ కార్మికులపై ఒక్కసారిగా గోడ కూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.