కుప్పం పరిధిలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కుప్పం -క్రిష్ణగిరి అంతర్రాష్ట్ర రహదారిలోని నడుమూరు అటవీ ప్రాంతంలో పలుచోట్ల భారీ వృక్షాలు జాతీయ రహదారిపై కూలడంతో ఆ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు కూలిన చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.