కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం ద్రవిడ విశ్వవిద్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య దొరస్వామి మాట్లాడుతూ. పూలే భారతదేశానికి చేసిన సేవ ఉన్నతమైనదని కొనియాడారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.