కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూసేకరణకు సంబంధించి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ బుధవారం శాంతిపురం మండలం, దండికుప్పం గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. భూములకు గతంలో నిర్ణయించిన ధర కంటే అదనపు పరిహారం అందించాలని రైతులు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్డీవో, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.