కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సోమవారం నూతన పెన్షన్లను అందజేశారు. డికే పల్లి, సామగుట్టపల్లి, 2వ సచివాలయ పరిధిలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పెన్షన్ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.