కుప్పం: 90 మంది రెస్కో ఉద్యోగులకు నోటీసులు

3చూసినవారు
కుప్పం: 90 మంది రెస్కో ఉద్యోగులకు నోటీసులు
కుప్పం రెస్కో పరిధిలో పనిచేస్తున్న 90 మంది ఉద్యోగులకు సంస్థ బుధవారం నోటీసులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెస్కోపై విచారణకు నియమించిన శ్రీలక్ష్మి కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, క్యాడర్ మార్పు తదితర అంశాలకు సంబంధించిన విద్యార్హతపై నోటీసులు ఇచ్చారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 5 లోపు తెలియజేయాలని ఉద్యోగులకు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్