కుప్పం నియోజక వర్గం, రామకుప్పం మండల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమం పై అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పెన్షన్ల పంపిణీ విధానం, అధికారుల పనితీరు, లబ్ధిదారుల అభిప్రాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ప్రతి అర్హులైన లబ్ధిదారునికి గౌరవప్రదంగా మరియు పారదర్శకంగా పెన్షన్ అందించేలా అధికారులు పనిచేయాలని కోరారు.